బాలీవుడ్ బ్యూటీ భవనం సీజ్.. కరోనా పాజిటివ్

బాలీవుడ్ బ్యూటీ భవనం సీజ్.. కరోనా పాజిటివ్
X

మహారాష్ట్రలో మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నటి మలైకా అరోరా నివసిస్తున్న టుస్కానీ అపార్ట్ మెంట్ లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో అప్రమత్తమైన ముంబై మున్పిపల్ అధికారులు భవనాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించి సీజ్ చేశారు.

లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి ఇంటి వద్దే ఉంటున్న మలైకా.. కుమారుడు అర్హాన్ పెంపుకు శునకం కాస్సర్ తో కాలక్షేపం చేస్తోంది. రోజూ ఓ గంట యోగా కచ్చితంగా చేస్తానని చెబుతున్న మలైకా తను చేసే యోగా ఆసనాలను ఇన్ స్టాలో రోజూ షేర్ చేస్తుంటుంది. కాగా, భారత్ లో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసులు 2 లక్షల 77 వేలు కాగా, మృతి చెందిన వారు 7,745 మంది. ఇక 90 వేలకు పైగా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర ప్రధమ స్థానంలో ఉంది.

Next Story

RELATED STORIES