దక్షిణ కొరియాలో మళ్ళీ కేసులు.. పెరిగిన నిరుద్యోగిత రేటు

దక్షిణ కొరియాలో మళ్ళీ కేసులు.. పెరిగిన నిరుద్యోగిత రేటు

దక్షిణ కొరియాలో బుధవారం కొత్తగా 50 సంక్రమణ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు, గత రెండు రోజులలో 40 కంటే తక్కువ సంక్రమణ కేసులు వచ్చాయి. ఈ కేసులలో కొన్ని స్థానిక వ్యక్తుల ద్వారా వచ్చినవి కాగా.. మరికొన్ని విదేశాల నుంచి వారి ద్వారా నమోదు అయ్యాయి. తాజా కేసులతో దక్షిణ కొరియాలో సుమారు 12,000 సంక్రమణ కేసులు ఉన్నాయి.. ఇప్పటివరకు ఇక్కడ కేవలం 276 మరణాలు మరణాలను మాత్రమే నిర్ధారించారు. కేసులు పెరుగుతుండడంతో సియోల్ ప్రాంతంలో ఇప్పటికే కఠినమైన దిగ్బంధం చర్యలను ప్రభుత్వం అమలు చేసింది.

ఇది జూన్ 14 వరకు కొనసాగుతుంది. అయితే వైరస్ కేసులు తగ్గకపోతే దక్షిణ కొరియా కఠినమైన నిబంధనలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పబ్ లు , పబ్లిక్ గార్డెన్ లు సహా ఇతర ప్రాంతాలలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా ఉన్నాయి. మరోవైపు బుధవారం విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం, మే నెలలో దక్షిణ కొరియా యొక్క నిరుద్యోగిత రేటు 10 సంవత్సరాల గరిష్టానికి చేరుకుంది, కరోనా మహమ్మారి ఉద్యోగ మార్కెట్లను దెబ్బతీసిందని పేర్కొంది. నిరుద్యోగిత రేటు గత నెలలో 4.5% గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story