తాజా వార్తలు

ఛలో సచివాలయానికి టీ కాంగ్రెస్ పిలుపు

ఛలో సచివాలయానికి టీ కాంగ్రెస్ పిలుపు
X

లాక్‌డౌన్‌లో కరెంట్ ఛార్జీల బాదుడుపై టీకాంగ్రెస్ నేతలు ఆందోళన బాటపడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ ఛలో సచివాలయానికి పిలుపిచ్చారు. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ముఖ్యనేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించారు. ఐతే.. ఈ నిరసనకు అనుమతించేది లేదన్న పోలీసులు, కాంగ్రెస్ నేతలను హౌస్‌ అరెస్ట్ చేశారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి సహా‌, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇతర ముఖ్యనేతలను బయటకు రాకుండా అడ్డుకున్నారు. తనను ఎందుకు నిర్బంధించారంటూ పోలీసులతో భట్టి విక్రమార్క వాగ్వాదానికి దిగారు. కరోనా కష్టకాలంలో అద్దెలు కూడా చెల్లించవద్దని చెప్పిన సీఎం.. కరెంటు బిల్లుల పేరుతో స్లాబ్‌లు మార్చి అధికంగా వసూలు చేస్తే ఎలాగని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడితే అరెస్టులు చేయడం దారుణమన్నారు. 3 నెలల కరెంటు బిల్లులు ఒకేసారి కట్టాలంటూ పేదలపై భారం వేయడం సరికాదని కాంగ్రెస్ నేతలంటున్నారు.

Next Story

RELATED STORIES