వామ్మో షూటింగ్స్ కే.. నేనూ వెళ్లను నా కూతుర్నీ పంపించను: శక్తి కపూర్

వామ్మో షూటింగ్స్ కే.. నేనూ వెళ్లను నా కూతుర్నీ పంపించను: శక్తి కపూర్

ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్లమో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం బయటకు వెళ్లాలంటేనే భయమేస్తుంది. కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో, ఏ మూల నుంచి అటాక్ చేస్తుందో అని భయంగా ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం సినిమా షూటింగ్ లు చేసుకోవచ్చంటూ అనుమతులు ఇచ్చినా నేను మాత్రం వెళ్లను, నా కూతురు శ్రద్ధా కపూర్ ని కూడా పంపించను అని అంటున్నారు బాలీవుడ్ నటుడు శక్తి కపూర్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బయటకు వెళ్లి పని చేయాలనుకోవడం లేదని ఆయన అంటున్నారు. ముందు ముందు పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. మనిషి ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదు. ఇలాంటి సమయంలో షూటింగ్స్ ప్రారంభిస్తే పరిస్థితులు మరింత అస్తవ్యస్థంగా మారతాయని అన్నారు. ఇంకొంత కాలం షూటింగ్స్ వాయిదా వేస్తే మంచిదని నా సన్నిహితులకు, స్నేహితులకు తెలియజేశానని శక్తి కపూర్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story