ఆ బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ షాక్.. డబ్బులు డ్రా చేయకూడదు

ఆ బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ షాక్.. డబ్బులు డ్రా చేయకూడదు
X

రిజర్వ్ బ్యాంక్ తాజాగా పీపుల్స్ కో ఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లకు షాకిచ్చింది. అలాగే బ్యాంక్ పై కూడా పలు ఆంక్షలు విధించింది. కస్టమర్లు అకౌంట్లో ఉన్న డబ్బును విత్ డ్రా చేసుకోవడం కుదరదని పేర్కొంది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి బాగాలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కస్టమర్లకు ఎలాంటి రుణాలు మంజూరు చేయవద్దని, డబ్బులు అకౌంట్లో డిపాజిట్ చేయించుకోవద్దని బ్యాంకును ఆదేశించింది. అనుమతి లేనిదే ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని బ్యాంకును ఆర్బీఐ ఆదేశించింది. అలాగే బ్యాంకునకు సంబంధించిన ఆస్తులను, అసెట్స్ ను విక్రయించడం కూడా కుదరదని స్పష్టం చేసింది.

Next Story

RELATED STORIES