భారత సంతతికి చెందిన రూబెన్ సోదరుల రూ.770 కోట్ల భారీ సాయం..

భారత సంతతికి చెందిన రూబెన్ సోదరుల రూ.770 కోట్ల భారీ సాయం..

ముంబైకి చెందిన భారత సంతతి రూబెన్ సోదరులు పార్క్ కళాశాలకు భారీ విరాళం ప్రకటించారు. ఈ కళాశాల ప్రముఖ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినది. ఇరువురూ కలిసి 8 కోట్ల పౌండ్లు (సుమారు రూ.770 కోట్లు) విరాళంగా ఇచ్చారు. డేవిడ్ రూబెన్ (81), సీమోన్ రూబెన్(78)లు భారీ విరాళం ఇచ్చి ఉదారతను చాటుకున్నారు. ఈ నిధులను స్కాలర్ షిప్ కార్యక్రమానికి వినియోగించనున్నారు. బాగ్దాది జెవీష్ కమ్యూనిటీకి చెందిన రూబెన్ సోదరులు ముంబైలో జన్మించారు.

1950లోన తల్లి నాన్సీతో కలిసి బ్రిటన్ వెళ్లి అక్కడే నివసిస్తున్నారు. 1990లో మైనింగ్, వస్తువుల వ్యాపారాలతో కెరీర్ ప్రారంభించారు. అనంతరం ఒకరు .. కార్పెట్ ట్రేడ్ లో, మరొకరు స్కాప్ మెటల్ బిజినెస్ లో రాణించారు. ప్రస్తుతం ఈ సోదరులిరువురూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ది సండే టైమ్స్ గణాంకాల ప్రకారం వీరిద్దరు 16 బిలియన్ పౌండ్ల సంపదతో బ్రిటన్ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. కాగా రూబెన్ సోదరులు ఇచ్చిన భారీ విరాళం చారిత్రాత్మకమని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story