కళ్లు చెదిరే 'కరీనా' ప్యాలెస్ ఎంతనుకుంటున్నారు.. జస్ట్ రూ.800 కోట్లే

కళ్లు చెదిరే కరీనా ప్యాలెస్ ఎంతనుకుంటున్నారు.. జస్ట్ రూ.800 కోట్లే
X

అందాలలో మహోదయం.. భూలోకమే నవోదయం.. అని దేవేంద్రుని కూతురు ఇంద్రజ జగదేక వీరుడు అతిలోక సుందరిలో పాట పాడింది ఇందుకేనేమో. వారసత్వ సంపదతో పాటు వాళ్లు సంపాదించిందీ బోలెడంత.. రూ.800 కోట్ల మహల్లో ఎందుకుండరు మరి. చుట్టూ అందమైన వనాలు.. మధ్యలో పెద్ద స్విమ్మింగ్ పూల్.. ఆ పక్కనే అందమైన రాజమందిరం. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ వైభోగం. బాలీవుడ్ స్టార్ హీరో సైప్ అలీఖాన్ పటౌడీ ప్యాలెస్ హరియాణాలోని పటౌడీ ప్రాంతంలో ఉంది. దీన్ని ఇబ్రహీం కోఠి అని కూడా పిలుస్తారు. పటౌడీ సంస్థానానికి చెందిన నవాబులు దీనిని నిర్మించి పరిపాలన సాగించారు. వారసత్వంగా వచ్చిన ప్యాలెస్ ఇప్పుడు సైఫ్ ఆధీనంలో ఉంది. 150 గదులున్న ఈ ప్యాలెస్ లో ఏడు డ్రెస్సింగ్ రూములు, ఏడు బెడ్ రూములు, డ్రాయింగ్ రూములు, పెద్ద డైనింగ్ హాలు, విశాలమైన గదులు ఉన్నాయి. ప్రస్తుతం సైఫ్ కుటుంబంలో జరిగే వేడుకలకు ఈ ప్యాలెస్ వేదిక అవుతుంది.

Next Story

RELATED STORIES