అమ్మకి కరోనా.. సాయం చేయమంటూ ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి నటి ట్వీట్

అమ్మకి కరోనా.. సాయం చేయమంటూ ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి నటి ట్వీట్
X

అమ్మకి కరోనా సోకింది. ఆస్పత్రిలో జాయిన్ చేయడానికి సాయం చేయండి అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రికి, ప్రధానికి నటి దీపికా సింగ్ ట్వీట్ చేశారు. ఢిల్లీలోని కరోనా పేషంట్లను ట్రీట్ చేసే ఆస్పత్రులకు ఫోన్ చేసినా బెడ్స్ ఖాళీ లేవంటున్నారని నటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు సాయం చేయమంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోదీలను ట్యాగ్ చేస్తూ వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం తన తల్లి చాలా నీరసంగా ఉందని సత్వరం స్పందించమని అడుగుతున్నారు. దీపిక పోస్ట్ పై నెటిజన్లు స్పందిస్తూ మేడమ్.. సెలబ్రెటీ అయిన మీ పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధమవుతోంది. కరోనా వచ్చిన సామాన్యుడు బ్రతుకు మీద ఆశ వదులుకోవాల్సిందేనేమో అని అంటున్నారు.

Next Story

RELATED STORIES