ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ అభ్యర్థి

ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ అభ్యర్థి
X

అరుణాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు బీజేపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైంది. మొత్తం 60 మంది ఎమ్మెల్యేలు ఉన్న అరుణాచల్‌ప్రదేశ్‌లో బీజేపీకి 41మంది ఉన్నారు. అటు జేడీయూకి 7, కాంగ్రెస్‌కు నలుగురు నేషనల్ పీపుల్స్ పార్టీకి నలుగురు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌కు ఒకరు ముగ్గురు ఇండిపెండెంట్ లు ఉన్నారు. కాగా, రాష్ట్రంలో ఇతర పార్టీలను నుంచి ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో బీజేపీ అభ్యర్థి నబమ్ రెబియా రాజ్యసభకు ఏకగ్రీవమయ్యారు.

బీజేపీకి చెందిన నబమ్ రెబియా అనుభవం ఉన్న నేత. ఇప్పటికే రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికైయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ స్పీకర్ గా, మంత్రిగా ఆయనకు అనుభవం ఉంది.

Next Story

RELATED STORIES