నిత్యామీనన్ అభిషేక్ బచ్చన్ తో కలిసి..

నిత్యామీనన్ అభిషేక్ బచ్చన్ తో కలిసి..
X

ఆకట్టుకునే అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించే మలయాళీ కుట్టి నిత్యా మీనన్ ఎంచుకునే పాత్రలు కాస్త భిన్నంగా ఉంటాయి. కథలో పాత్ర నచ్చకపోతే నిర్మొహమాటంగా మొహం మీద చెప్పేసి ఎంత పొగరో అని అనిపించుకున్న సందర్భాలు ఉన్నాయి. అయినా ఏ మాత్రం తగ్గదు ఎక్కడా రాజీ పడదు. అందుకేనేమో తెలుగు ప్రేక్షకులూ ఆమెని అభిమానించడం మొదలు పెట్టారు. నిత్య బాలీవుడ్ కథానాయకుడు అభిషేక్ బచ్చన్ తో కలిసి బ్రీత్ ఇన్ టు ది షాడోస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది.

అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానున్న ఈ సిరీస్ మొదటి సీజన్ ఇప్పటికే విడుదలైంది. ఇప్పుడు రెండో సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను అభిషేక్ విడుదల చేశారు. తను నీడలో ఉంటూ కావాల్సిన దాని కోసం ఎదురు చూస్తోంది.. బ్రీత్ ఇన్ టు ది షాడోస్ అని పోస్ట్ చేశారు. జులై 10 నుంచి ఈ సీజన్ ప్రసారం అవుతుంది. నిత్య మొదటి సారి నటిస్తున్న వెబ్ సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్ కి మయాంక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సీజన్ 1 ను సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందించారు. ఓ సాధారణ వ్యక్తి అసాధారణ పరిస్థితులను ఎలా ఎదుర్కుంది అనేదే కథాంశం.

Next Story

RELATED STORIES