500 బిలియన్ డాలర్లు మార్కు దాటిన విదేశీ మారక ద్రవ్యం నిల్వలు

500 బిలియన్ డాలర్లు మార్కు దాటిన విదేశీ మారక ద్రవ్యం నిల్వలు

దేశంలో విదేశీ మారక ద్రవ్యం నిల్వలు బారీగా పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. 500 బిలియన్ డాలర్లు(రూ.37 లక్షల కోట్లు) మార్కును మొదటిసారిగా దాటిందని పేర్కొంది. ఈ స్థాయిలో విదేశీ మారక ద్రవ్యం నిల్వలు ఉండటం ఇదే మొదటిసారని రిజర్వబ్యాంక్ తెలిపింది. ఈ వారంలో 8.2 బిలియన్ డాలర్లు(రూ.6వేల కోట్లకు పైగా) నిల్వ పెరిగి.. జూన్ 5 నాటికి భారత విదేశీ మారక ద్రవ్యం 501.7 బిలియన్ డాలర్లకు చేరిందని తెలిపింది. మొత్తం నిల్వలలో 463 బిలియన్ డాలర్లు కరెన్సీ రూపంలో ఉండగా.. 32.35 బిలియన్ డాలర్లు బంగారం రూపంలో ఉందని ఆర్బీఐ ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story