ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల ఎన్కౌంటర్

X
జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలోని నిపోరా ప్రాంతంలో శనివారం ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. ఇందులో 2 పిస్టల్స్, 3 గ్రెనేడ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిపోరా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ ను ప్రారంభించాయి, అయితే అదే సమయంలో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు.. దాంతో భద్రతా దళాలు కూడా ఎదురుకాల్పులు జరపడంతో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో గత 13 రోజుల్లో 8 ఎన్కౌంటర్లు జరిగినట్టయింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
