రోజూ ఓ గ్లాస్ కాకర జ్యూస్.. ప్రయోజనాలెన్నో..

రోజూ ఓ గ్లాస్ కాకర జ్యూస్.. ప్రయోజనాలెన్నో..
X

కాకరకాయ పేరు చెబితే చేదు అని పారిపోతారు కాని దాని ఉపయోగాలు తెలిస్తే ఇప్పటి వరకు తినని వాళ్లు కూడా తినడానికి ప్రయత్నిస్తారు. పోషకాహార నిపుణులు ఆహారంలో కాకరకాయను కచ్చితంగా చేర్చమంటారు. ఆరోగ్యానికి అమృతం లాంటింది అని అంటారు. ఆస్తమా, జలుబు, దగ్గు వంటి శ్వాస సంబంధ సమస్యలకు, లివర సమస్యలకు కాకర జ్యూస్ అద్భుతంగా పని చేస్తుంది. కడుపు నొప్పి, మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి రోగాలకు ఎంతో మేలు చేస్తుంది.

* కాకరలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ప్రేరేపించడానికి ఉపకరిస్తాయి. ఫైబర్ ఉన్నందున మలబద్దకాన్ని నివారిస్తుంది.

* డయాబెటిస్ ఉన్న వారిని తరచూ తీసుకోమని చెబుతారు వైద్యులు. ఇందులో యాంటీ-డయాబెటిక్ లక్షణాలతో కూడిన మూడు క్రియాశీల పదార్థాలు ఉన్నాయి. అవి పాలీపెప్టెడ్-పి, వైసిన్, చరణి. ఇవి ఇన్సులిన్ లాంటి లక్షణాలు కలిగి రక్తంలో గ్లూకోజ్ నిల్వలను తగ్గిస్తాయి. అంతేకాకుండా కాకరలో లెక్టిన్ ఉండడం వలన ఆకలిని తగ్గిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ కాకర జ్యూస్ తీసుకుంటే డయాబెటిస్ అందుబాటులో ఉంటుంది.

* విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలెర్జీని నివారించడంలో సహాయపడుతుంది.

* రక్తాన్ని శుద్ధి చేసి కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. పేగులను శుభ్రపరిచి మూత్రాశయ పని తీరును మెరుగుపరుస్తుంది.

* క్యాన్సర్ కారకాలైన ప్రీ రాడికల్స్ పని తీరును తగ్గిస్తుంది.

* చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఇందులో ఉన్న పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అధిక మొత్తంలో ఉండడం వలన గుండెపై ఇవి సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.

* జుట్టు ఆరోగ్యానికి కాకర తోడ్పడుతుంది. వెంట్రుకల కుదుళ్లకు కాకర జ్యూస్ రాయడం వలన ధృడంగా తయారవుతాయి.

* మొటిమలు, మచ్చలు, చర్మానికి సంబంధించిన అంటు వ్యాధులు ఉన్నవారు కాకరను ప్రతి రోజు నిమ్మరసంతో కలిపి 6 నెలల పాటు తీసుకుంటే ఫలితం ఉంటుంది. చర్మానికి సున్నితత్వాన్ని చేకూరుస్తుంది.

* కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. దృష్టి సంబంధిత సమస్యలను నివారించడంలో కాకర సహాయపడుతుంది.

Next Story

RELATED STORIES