డ్యాన్స్ బాగా చేయలేదని కొరియోగ్రాఫర్ అందరి ముందూ..: ప్రియాంక చోప్రా

డ్యాన్స్ బాగా చేయలేదని కొరియోగ్రాఫర్ అందరి ముందూ..: ప్రియాంక చోప్రా
X

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కెరీర్ ఆరంభించిన తొలి నాళ్లలో తనకు ఎదురైన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న తరువాత నటించిన మొదటి చిత్రం తమిళ సినిమా నటుడు విజయ్ తో. దిహీరో చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెట్టారు. అందాజ్ చిత్రంలో హీరో అక్షయ్ కుమార్, లారా దత్తా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రంలో ప్రియాంకకు అవకాశం వచ్చింది. ఆ చిత్రానికి రాజ్ కన్వార్ దర్శకుడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆ చిత్రం షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను ప్రియాంక ఇటీవల గుర్తు చేసుకున్నారు.

చిత్రానికి సంబంధించిన ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ దక్షిణాఫ్రికాలో జరుగుతుండగా కొరియోగ్రాఫర్ రాజ్ ఖాన్ నా డ్యాన్స్ బాగా లేదని తిట్టారు. 40 టేకులు తీసుకున్నా డ్యాన్స్ సరిగా చేయలేకపోయాను. దాంతో ఆయన కోపంగా చేతిలో ఉన్న మైకును పక్కకు విసిరేసి ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకోగానే సరికాదు.. మంచి నటి కావాలంటే డ్యాన్స్ వచ్చుండాలి. ముందు డ్యాన్స్ నేర్చుకుని వచ్చి తరవాత నటించు అని అందరి ముందూ గట్టిగా కేకలు వేశారు. ఆయన డ్యాన్స్ మాస్టర్ సరోజ్ ఖాన్ కుమారుడు. దాంతో నేను చాలా బాధపడ్డాను.

ఎలాగైనా డ్యాన్స్ నేర్చుకోవాలనే పట్టుదలతో పండిత్ వీరు కృష్ణ గారి దగ్గరకు వెళ్లి కథక్ నేర్చుకున్నా. ఆ సమయంలో అదృష్టవ శాత్తు షూటింగ్ కొన్ని రోజులు వాయిదా వేశారు. రోజుకు 6 గంటలు సాధన చేసి తరువాతి షెడ్యూల్ కోసం సెట్ లో అడుగు పెట్టా. అప్పుడు నా డ్యాన్స్ చూసి కొరియోగ్రాఫర్ మెచ్చుకున్నారు. అందుకే తెలియని పని ఏదైనా ఉంటే నిరుత్సాహ పడవద్దు. నేర్చుకోవాలనే తపన ఉంటే స్వీయ సాధనతో సాధించొచ్చు అప్పుడు అందరిలో మీరు ఉత్తములుగా ఉండొచ్చు అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చారు.

Next Story

RELATED STORIES