బిగ్ బ్రేకింగ్: ధోని సినిమా హీరో ఆత్మహత్య

X
బాలీవుడ్ సిని ప్రముఖుల మరణాలు కలకలం రేపుతున్నాయి. ధోని సినిమాలో హీరోగా నటించిన సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ముంబైలో తన నివాసంలో ఉరివేసుకున్నాడు. ఈ నెల సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా, ఇటీవల బాలీవుడ్ ప్రముఖులు వరుసగా మరణించడంతో.. ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. ఇటీవల ఇమ్రాన్ ఖాన్, రిషి కపూర్ మరణించిన విషయం తెలిసింది. ఇప్పుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో ఇండస్ట్రీ ఒకసారిగా ఉలిక్కిపడింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
