శబరిమల ఆలయంలో పూజలు పున:ప్రారంభం

శబరిమల ఆలయంలో పూజలు పున:ప్రారంభం
X

అయ్యప్పస్వామి కొలువైన శబరిమల ఆలయం ఇవాళ తెరుచుకోనుంది. నెలవారి పూజల కోసం ఆలయాన్ని తెలుస్తున్నట్టు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. అయితే, భక్తులెవరికీ ఆలయంలోకి అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రతిఏటా డిసెంబర్, జనవరి మాసాల్లో అయ్యప్పస్వాములతో శబరిగిరులు కిటకిటలాడుతాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా స్వామివారిని భక్తులు పెద్దయెత్తున దర్శించుకున్నారు.

ఇక, జనవరిలో మకర జ్యోతి దర్శనం తర్వాత కొద్దిరోజులకు మూతపడింది. అంతలోనే కరోనా మహమ్మారి దేశంలోకి అడుగుపెట్టడం, లాక్‌డౌన్‌ ప్రకటించడంతో గుడి తలుపులు మళ్లీ తెరుచుకోలేదు. ఇక లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో నెలవారీ పూజల కోసం శబరిమల ఆలయం తెరుచుకుంటోంది.

Next Story

RELATED STORIES