మిస్టరీగా మారిన హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య

మిస్టరీగా మారిన హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య
X

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య మిస్టరీగా మారింది. సూసైడ్‌కు కారణాలపై ముంబాయి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వర్ధమాన హీరోగా ఎదుగుతున్న క్రమంలో సుశాంత్ సూసైడ్ చేసుకోడానికి కారణమేంటి? లవ్ మ్యాటరా? గతంలో 14 అంతస్థుల బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ మేనేజర్ కేసుకు లింక్ ఉందా? మరేవైనా కారణాలు ఉన్నాయా? ఇలా వివిధ కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌ను షాక్‌కు గురిచేసింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా సుశాంత్ మరణం కలిచివేసింది. ఎదుగుతున్న గొప్ప నటుడిని కోల్పోయామంటూ మోదీ, రాహుల్‌తోపాటు బాలీవుడ్ నటులు ట్వీట్‌లు చేశారు. బుల్లితెర, వెండితెరపై ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు చిన్న వయసులోనే దూరం కావడం తనను కలిచివేసిందంటూ మోదీ ట్వీట్ చేశారు. ఆయన కుటుంబసభ్యులకు మోదీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సుశాంత్ మరణ వార్త విని నిశ్చేష్టుడయ్యానని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. సుశాంత్ కుటుంబసభ్యులు, స్నేహితులు, ఫ్యాన్స్‌కు తన సంతాపం తెలిపారు.

అటు బాలీవుడ్ హీరో హీరోయిన్లు సుశాంత్ మరణంపై సంతాపం ప్రకటించారు. సుశాంత్ నిన్ను మిస్సవుతున్నామంటూ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. సుశాంత్ మరణం తనను షాక్‌కు గురిచేసిందని, నోట మాట రాకుండా చేసిందని మరో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. చిచోరే సినిమాలో సుశాంత్ నటన చూసి పడిపడి నవ్విన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సుశాంత్‌తో ఉన్న అనుబంధాన్ని బాలీవుడ్, టెలివిజన్ నటీనటులు గుర్తు చేసుకుంటూ ట్వీట్‌లు చేస్తున్నారు.

టెలివిజన్‌ యాక్టర్‌గా ఫేమస్ అయిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్... కైపోచే సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత డిటెక్టివ్ భోంకేశ్ భక్షీ చిత్రంలో నటించినా... పాపులర్ అయింది మాత్రం ధోనీ సినిమాతోనే. ధోనీ సినిమాలో అద్భుత నటనకు ప్రపంచ వ్యాప్తంగా సుశాంత్‌పై ప్రశంసల జల్లు కురిసింది. ఆ తర్వాత రాబ్తా, చిచోరే వంటి చిత్రాల్లో సుశాంత్ అద్భుతంగా నటించారు. ఆయన లేటెస్ట్ మూవీ దిల్ బేచారా. సుశాంత్‌ మరణాన్ని దిల్ బేచారా సినిమా యూనిట్ జీర్ణించుకోలేకపోతోంది.

Next Story

RELATED STORIES