ఉద్యోగం బోర్ కొట్టింది.. కంపెనీపై కేసు వేసి రూ.34 లక్షలు..

ఉద్యోగం బోర్ కొట్టింది.. కంపెనీపై కేసు వేసి రూ.34 లక్షలు..

చేస్తున్న పనే చేస్తుంటే కొన్ని ఉద్యోగాలు బోర్ కొడతాయి. ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నించే వాళ్లు అలాంటి ఉద్యోగాల్లో ఉండాలంటే కష్టమే మరి. అందుకే ఫ్రాన్స్ కు చెందిన ఫ్రెడరిక్ డెస్సార్డ్ తాను ఫెర్ఫ్యూమ్ కంపెనీలో ఇంక పని చేయను, అయినా యాజమాన్యం కూడా తనతో సరిగా ఉండట్లేదని మనో వేదనకు గురై ఆఫీస్ కి వెళ్లడం మానేశాడు. 2015లోనే ఉద్యోగానికి బై చెప్పేశాడు. మరో జాబ్ చేసి బిజీగా ఉంటే కష్టమని అత్తరు కంపెనీ యాజమాన్యంపై కోర్టులో కేసు వేశాడు. కోర్టులో కేసు నడిచినంత కాలం వెళ్లి రావడం సరిపోయేది.

జాబ్ పోయినందుకు తానెంతో మనో వేదనకు గురయ్యానని, యాజమాన్యం తన పట్ల ప్రవర్తించిన తీరు నచ్చలేదని, ఇందుకు నష్ట పరిహారం చెల్లించాలని కోర్టులో వాదించాడు. వాదోపవాదాలు విన్న అనంతరం కోర్టు తీర్పు ఫ్రెడరిక్ కు అనుకూలంగా వచ్చింది. నాలుగేళ్ల పాటు సాగిన పోరాటంలో 4 లక్షల యూరోలు నష్టపరిహారం అడిగాడు. అయితే కోర్డు 45 వేల యూరోలను ఫ్రెడరిక్ కు ఇవ్వాలని ఫెర్ఫ్యూమ్ కంపెనీని ఆదేశించింది. ఈ పరిహారం మన దేశ కరెన్సీలో రూ.34.20 లక్షల వరకు ఉంటుంది. ఈ తరహా కేసు ఫ్రాన్స్ న్యాయచరిత్రలోనే మొదటి సారి.

Tags

Read MoreRead Less
Next Story