నిరాడంబరంగా కేరళ సీఎం కుమార్తె వివాహం

నిరాడంబరంగా కేరళ సీఎం కుమార్తె వివాహం
X

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆడంబరాలకు దూరంగా ఉంటారన్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా ఆయన కుమార్తె వివాహం విషయంలో కూడా ఈ విషయం వెల్లడైంది. సోమవారం తిరువనంతపురంలో ఆయన పెద్ద కుమార్తె వీణ వివాహం సీపీఐఎం యువజన విభాగం డీవైఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు, న్యాయవాది మహ్మద్ రియాజ్‌ తో జరిగింది. ఈ శుభకార్యానికి కేవలం కుటుంబసభ్యులు, కొంతమంది అతిధులు మాత్రమే హాజరయ్యారు.

ఈ కార్యక్రమం అత్యంత నిరాడంబరంగా జరిగింది. కాగా వీణ, రియాజ్ లకు ఇది రెండో వివాహం. మొదటి వివాహంలో వీణకు ఒకరు, రియాజ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా రియాజ్ 2009 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కోజికోడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సీపీఐ(ఎమ్‌) అభ్య‌ర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి చేతిలో ఓటమి చెందారు. ఇక వీణ బెంగుళూరులో ఓ కంపెనీని స్థాపించి దానికి ఎండిగా కొనసాగుతున్నారు.

Next Story

RELATED STORIES