ఇలాంటి ఫోటోలు షేర్ చేయొద్దు: పోలీసుల వార్నింగ్

అసలే బాధలో ఉన్న అభిమానులకు ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తే వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయొద్దని మహారాష్ట్ర సైబర్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి ఫోటోలను షేర్ చేయడం చట్టరీత్యా నేరమని ఒకవేళ ఇప్పటికే షేర్ చేసి ఉంటే డిలీట్ చేయమని కోరుతున్నారు. ఈ మేరకు సుశాంత్ అభిమానులు సైబర్ పోలీసులకు ట్విట్టర్ ద్వారా తెలియపరిచారు.
వెంటనే పోలీసులు స్పందించి చర్యలు తీసుకున్నారు. డెబ్ బాడీ ఫోటోలను చూసి తట్టుకోలేకపోతున్నామని.. దయచేసి అలాంటివి షేర్ చేయనీయకుండా చూడండి అని అభిమానులు పోలీసులను కోరారు. మా అభిమాన హీరో నవ్వును మాత్రమే చూడాలనుకుంటున్నామని తెలిపారు. సుశాంత్ మరణంతో బాలీవుడ్ కన్నీటి సంధ్రమైంది. ఓ మంచి నటుడిని కోల్పోయామని ఆయన నటించిన సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com