ఎస్బీఐలో 8 మందికి కరోనా.. మూడు బ్రాంచ్ లు మూసివేత

ఎస్బీఐలో 8 మందికి కరోనా.. మూడు బ్రాంచ్ లు మూసివేత
X

దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ముంబై, థానే నగరాల్లోని మూడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీల్లో 8 మంది ఉద్యోగులకు కరోనా వైరస్ సోకడంతో వారిని క్వారంటైన్ కేంద్రానికి తరలించి బ్యాంకును తాత్కాలికంగా మూసివేశారు. థానే నగరంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ లో పని చేసే 25 మంది ఉద్యోగుల్లో 7 గురికి పాజిటివ్ వచ్చింది. అలాగే జోగేశ్వరీ ఈస్ట్ ప్రాంతంలోని ఎస్బీఐ లోకల్ చెక్ ప్రాసెసింగ్ సెల్ లో పనిచేస్తున్న క్యాషియర్ కు కరోనా సోకింది.

అంథేరిలోని బ్యాంకు బ్రాంచ్ లో తోటమాలిగా పని చేస్తున్న ఓ ఉద్యోగికి వైరస్ సోకడంతో ముందు జాగ్రత్తగా బ్యాంకును మూసివేశారు. గతంలో చర్చ్ గేటు, బేలాపూర్ సీబీడీ, ఘట్ కోపర్, ఎస్బీఐ బ్రాంచ్ లలో పనిచేసే ముగ్గురు ఉద్యోగులు కరోనాతో మరణించారు. ఎస్బీఐ ఉద్యోగులను కరోనా భయం వెంటాడుతోంది. దీంతో ఉద్యోగులు చాలా మంది బ్యాంకుకు సెలవు పెట్టి ఇళ్లలో ఉంటున్నారు. ఇంటి నుంచి పని చేసే వెసులు బాటు ఉంటే చేస్తున్నారు. కేసులు ఎక్కువవుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.

Next Story

RELATED STORIES