ఉదయం ఏం జరిగింది.. ఆత్మహత్యకు కారణం..

ఉదయం ఏం జరిగింది.. ఆత్మహత్యకు కారణం..
X

ఆరునెలలుగా ఆత్మహత్య ఆలోచనలు.. చుట్టూ అందరూ ఉన్నా ఒంటరి అన్న ఫీలింగ్.. తన మనోవేదన పరిష్కరించలేని సమస్యగా భావించాడు. వెరసి ఎంతో భవిష్యత్ ఉన్న యువనటుడు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. సుశాంత్ రాజ్ పుత్ అర్థాంతరంగా తనువు చాలించడం యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అనుమానాస్పదంగా కేసు ఫైల్ చేసి పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులకు సుశాంత్ ఫ్లాట్ సూసైడ్ కు సంబంధించిన నోట్ కూడా ఏమీ దొరకలేదు. కొన్ని మెడిసన్స్ మాత్రం గుర్తించారు.

ఈ మధ్యే సుశాంత్ బాంద్రాలోకి ఓ ఫ్లాట్ కు మారారు. దీనికి నెలకు అద్దె రూ.4.5 లక్షలు చెల్లిస్తున్నారు. ముగ్గురు పనివాళ్లతో ఉంటున్నారు. అతడి మృతికి ఎలాంటి కారణాలు లేవని స్నేహితులు చెబుతున్నారు. శనివారం రాత్రి ఆలస్యంగా నిద్రపోయారని సమాచారం. అయితే ఆదివారం ఉదయం జ్యూస్ తాగి బెడ్ రూమ్ తలుపు వేసుకున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో పనివాళ్లు స్నేహితులకు సమాచారం అందించారు. వారు వచ్చి తలుపులు పగుల గొట్టి చూడగా విగత జీవిగా సీలింగ్ కు వేలాడుతూ కనిపించాడు సుశాంత్.

ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి ఓ టీవీ యాక్టర్ కు ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం 9.30సమయంలో సుశాంత్ తన సోదరితో మాట్లాడినట్లు తెలుస్తోంది. గతవారం సుశాంత్ మేనేజర్ దిశా కూడా ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనంతరం సుశాంత్ ఆత్మహత్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు పోలీసులు.

Next Story

RELATED STORIES