భారత్ లో వేగంగా పెరుగుతోన్న కరోనా కేసులు, మరణాలు

భారత్ లో వేగంగా పెరుగుతోన్న కరోనా కేసులు, మరణాలు

దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3 లక్షల 43 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు పదివేల మంది కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారు. అలాగే దేశవ్యాప్తంగా రికవరీ రేటు ఇంకాస్త పెరిగింది. లక్ష 50 వేల మందికిపైగ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, లక్ష 80 వేల మంది కరోనా నుంచి బయటపడి ఆస్పత్రుల నుంచి డి శ్చార్జ్ అ్యయారు. రికవరీ రేటు 52 శాతానికి చేరిందని, మున్ముందు ఇది ఇంకా పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.

మహారాష్ట్రలో వైరస్ విధ్వంసం విశృంఖలంగా కొనసాగుతోంది. ఇక్కడ వైరస్ బాధితుల సంఖ్య లక్ష 10 వేలు దాటింది. తమిళనాడులో 47 వేల మంది బాధితులుండగా ఢిల్లీలో 43 వేల కేసులు వచ్చాయి. గుజరాత్‌లో 24 వేల మందికిపైగా వైరస్ బారిన పడగా, దాదాపు 1500 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Read MoreRead Less
Next Story