గుజరాత్‌లో వరుసగా రెండు సార్లు భూకంపం

X
By - TV5 Telugu |16 Jun 2020 12:41 AM IST
ఉత్తర భారతదేశంలో భూప్రకంపనలు ఆందోళనల కలిగిస్తున్నాయి. తాజాగా గుజరాత్ లో స్వల్పం భూమి కంపించింది. అయితే, 24 గంటల్లో 2 సార్లు భూ కంపం రావడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం అర్థరాత్రి కచ్ లో కంపించింది. తరువాత సోమవారం మధ్యహ్నం కూడా మరోసారి స్వల్పంగా కంపించింది. అయితే, రెండు సార్లు కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగలేదు. రిక్టార్ స్కేల్ పై 4.5 తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. కాగా, గత కొన్ని రోజుల్లో పలు సార్లు ఢిల్లీలో భూకంపం సంభవించింది. అటు, సోమవారం తెల్లవారుజామున జమ్మూ కశ్మీర్ స్వల్పంగా భూమి కంపించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com