జమ్మూకశ్మీర్ లో మరో ముగ్గురు ఉగ్రవాదుల ఏరివేత

జమ్మూకశ్మీర్ లో మరో ముగ్గురు ఉగ్రవాదుల ఏరివేత
X

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా మరో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు ఎన్‌కౌంటర్ చేశాయి. షోపియన్‌లోని తుర్క్వాంగం ప్రాంతంలో మంగళవారం ఉదయం ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు గుర్తు తెలియని ఉగ్రవాదులను నిర్మూలించినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. శోధన ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉందని తెలిపారు. గత నెల నుండి జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి.

అంతకుముందు శనివారం, దక్షిణ కాశ్మీర్ కుల్గం జిల్లాలోని జాదూరా నిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. కాగా ఈ నెలలో 28 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో దక్షిణ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలోని రెబన్ పిన్జురా, సుగూ గ్రామాల్లో జరిగిన మూడు ఎన్‌కౌంటర్లలో వారంలోపు 14 మంది ఉగ్రవాదులు మరణించారు.

Next Story

RELATED STORIES