coronavirus : గత వారంరోజులుగా స్పెయిన్ లో ఒక్క మరణం లేదు

X
TV5 Telugu16 Jun 2020 2:02 PM GMT
ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనావైరస్ మహమ్మారి స్పెయిన్ లో శాంతించినట్టుంది. వారంరోజులుగా ఒక్క మరణం కూడా సంభవించలేదు. దీంతో ఆ దేశ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనావైరస్ భారతదేశం , స్పెయిన్లో దాదాపు ఒకేసారి బయటపడింది. స్పెయిన్‌లో మొదటి కేసు జనవరి 31న బయటపడితే.. భారతదేశంలో జనవరి 30న బయటపడింది.
స్పెయిన్‌లో ఇప్పటివరకు 27 వేల 136 మంది కరోనా ఇన్‌ఫెక్షన్ కారణంగా మరణించారు. ఇప్పటివరకూ 291,189 మంది కరోనా భారిన పడ్డారు. మరోవైపు కరోనా తగ్గుముఖం పట్టడంతో జూన్ 21 నుండి స్పెయిన్ సరిహద్దులను ఇతర యూరోపియన్ యూనియన్ దేశాల కోసం తెరుస్తామని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ చెప్పారు.
Next Story