సుశాంత్ బాల్య స్నేహితుడి భావోద్వేగం..

సుశాంత్ బాల్య స్నేహితుడి భావోద్వేగం..
X

మనిషి వెళ్లి పోయిన తరువాత మౌనంగా రోదించడం మాత్రమే తెలుసు.. సాటి మనిషి బాధల్ని పంచుకోలేని ఉరుకుల పరుగుల జీవితం. పార్టీ చేసుకుందాం రమ్మంటే పొలోమని వెళ్లి పోతారు. అదే ఒంట్లో నలతగా ఉందంటే పలకరించేందుకు ఒక్కరూ ఉండరు. సుశాంత్ బాల్యస్నేహితుడు 9 సంవత్సరాల నుంచి స్నేహితుడితో మాట్లాడనందుకు కృంగి పోతున్నాడు. ఎందుకలా చేశాను. నీ స్నేహాన్ని ఎందుకు కోల్పోయాను అని కలిసి తిరిగిన బాల్యాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. మళ్లీ జన్మ ఉంటే మనిద్దరం స్నేహితులుగానే పుడదాం. ఈసారి ఆ స్నేహ మాధుర్యాన్ని చివరి అంచుల దాకా చూసొద్దాం అని అంటున్నాడు. వారి చిన్ననాటి సంగతులను ఫేస్ బుక్ లో షేర్ చేశాడు బాల్య మిత్రుడు అతుల్ మిశ్రా.

సుశాంత్ నిన్నెప్పుడు తలుచుకున్నా మనసులోని భావాలను బయటపెట్టడానికి ఇబ్బంది పడే ఓ టీనేజ్ కుర్రాడు గుర్తుకొస్తాడు. మన స్నేహితులకి నువ్వు ఫిజిక్స్ చెప్తే, నేను బయాలజీ, ఇంగ్లీష్ చెప్పేవాడిని. నీకు అమ్మ లేదని మా అమ్మ చేసిన వంటలు తెచ్చి పెడితే ఎంతో ఇష్టంగా తినేవాడివి. నువ్వెంతో అద్భుతమైన వ్యక్తివి. ఎందుకు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయావు..

బాలీవుడ్ కోసం నువ్వు పేరులోని రాజ్ పుత్ పదాన్ని తొలిగించావు. దాన్ని నేను అంగీకరించలేకపోయాను. బాలీవుడ్ మాఫియా నీతో అనకూడని పదాలు పలికించింది. కానీ నీ అసలు ఉద్దేశం అది కాదు. ఆ సమయంలో నువ్వెంత ఒత్తిడికి గురై ఉంటావో అర్థం చేసుకోగలను. మనం తొమ్మిదేళ్లుగా మాట్లాడుకోలేదు. కానీ సోషల్ మీడియాలో నువ్వు పెట్టిన పోస్టులు చూస్తే నీ మానసిక వేదన అర్థమవుతుంది.

స్టార్ కిడ్స్ కి మాత్రమే అవకాశం ఉన్న ఇండస్ట్రీలో నిన్ని బయటి వ్యక్తిగా భావించేలా చేశారని అర్థమైంది. నీకు అందాల్సిన విజయం అందకుండా చేశారని తెలుసు. నువ్వు బలహీనుడివి కాదు. స్కూల్లో ఎన్నో సమస్యల్ని మనిద్దరం కలిసి పరిష్కరించాం. మనం నిత్యం టచ్ లో ఉంటే బాగుండేది. ఆ విషయం నిన్ను పోగొట్టుకున్నాక తెలిసింది. నీతో అన్ని సంవత్సరాలు ఎందుకు మాట్లాడకుండా ఉన్నానో నాకు అర్థం కావట్లేదు. నన్ను క్షమించు.

బంధుప్రీతితో నిండిపోయిన బాలీవుడ్ పై ఇద్దరం కలిసి చివరిసారి పోరాటం చేసి ఉంటే బాగుండేది. మనం టచ్ లో లేని ఈ తొమ్మిదేళ్లలో నీపై ఎన్నో సార్లు కోపగించుకున్నాను. నిన్ను చూసి గర్వపడ్డాను. నువు ప్రస్తుతం నాతో లేవు. నిన్ను చాలా మిస్సవుతున్నాను. మళ్లీ ఏదో ఒకరోజు కలుస్తాం. అప్పుడు చాలా మాట్లాడుకుందాం. అది మరో ప్రపంచంలోనో.. మరో జన్మలోనో తెలియదు. అంతవరకూ ఐ మిస్ యూ మై ఫ్రెండ్ అని అతుల్ మిశ్రా పెట్టిన పోస్ట్ నెటిజన్ల చేత కన్నీళ్లు పెట్టిస్తుంది.

Next Story

RELATED STORIES