ప్రతి రోజు లక్షకు పైగా కరోనా కేసులు: డబ్ల్యూహెచ్ ఓ

ప్రతి రోజు లక్షకు పైగా కరోనా కేసులు: డబ్ల్యూహెచ్ ఓ

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు గత రెండు వారాలుగా ప్రతి రోజు లక్షకు పైగా నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) తెలిపింది. వీటిలో ఎక్కువగా రెండు అమెరికా ఖండాలు, దక్షిణాసియా దేశాలు ఉంటున్నాయని సంస్థ చీఫ్ టెడ్రోస్ వెల్లడించారు. ఒకప్పుడు లక్ష కేసులు పెరగడానికి ఎంతో సమయం పట్టేదని గుర్తు చేసుకున్నారు. అలాగే చైనాలో వైరస్ వ్యాప్తి సమూహాన్ని గుర్తించినట్లు తెలిపారు. చైనాలో వైరస్ వ్యాప్తి రెండో విడత ప్రారంభమైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.

బీజింగ్ లో వెలుగు చూసిన రెండో విడత కరోనా కేసు మూలాలను వెతికే పనిలో పడ్డారు అక్కడి అధికారులు అని తెలిపారు. అయితే తాజాగా వెలుగు చూసిన వైరస్ మూలాలు ఐరోపాకు చెందినవని చైనా చెబుతోంది. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు పూర్తిగా బహిర్గతం కాలేదన్నారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసులు 80,05,294..వీరిల 4,35,662 మంది మరణించారు. పాజిటివ్ కేసుల విషయంలో అమెరికా, బ్రెజిల్. రష్యా తరువాత భారతదేశం నాలుగో స్థానంలో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story