జూన్ 19 నుంచి జూన్ 30 వరకు లాక్డౌన్.. విమానాలు, రైళ్ల పరిస్థితి..

జూన్ 19 నుంచి జూన్ 30 వరకు లాక్డౌన్.. విమానాలు, రైళ్ల పరిస్థితి..

చెన్నైతో పాటు చెంగళపట్టు, కాంచీపురం, తిరువళ్లూర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈనెల 19 నుంచి 30 వరకు లాక్డౌన్ విధించనున్నట్లు తమిళనాడు సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే చెన్నై మీదుగా వెళ్లే విమానాలు, రైళ్ల రాకపోకల పరిస్థితి ఏంటనే సందిగ్ధావస్థలో ఉన్నవారికి సర్కారు వివరణ ఇచ్చింది. ఈ ప్రాంతాల మీదుగా ప్రయాణం చేయదలచిన వారు తప్పనిసరిగా ఈ పాస్ తీసుకోవాలని క్లారిటీ ఇచ్చింది. మెడికల్ ఎమర్జెన్సీ కేసులు, పెళ్లిళ్లు, మరణాలు వంటి వాటి కోసం చెన్నై నుంచి వెళ్లాలన్నా.. చెన్నైకి రావాలన్నా ఈ పాస్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే రాకపోకలకు అనుమతి ఉన్నప్పటికీ కరోనా టెస్టు చేయించుకోవాల్సిందే. ఫలితాలు వచ్చిందాకా ప్రయాణికులు వేచి ఉండాల్సిందే. పాజిటివ్ వస్తే ఆస్పత్రికి.. నెగిటివ్ వస్తే 14 రోజులు క్వారంటైన్ కి తరలిస్తారు. ఇక మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ప్రాంతాల నుంచి వస్తే టెస్టులతో పన్లేదు.. ఏడు రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే. కరోనా అలా భయపెడుతోంది మరి.

Tags

Read MoreRead Less
Next Story