కరోనా ఎఫెక్ట్.. బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు!!

కరోనా ఎఫెక్ట్.. బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు!!
X

ఇంకో అయిదేళ్ల కన్నా ప్రజలు డిజిటల్ టెక్నాలజీతో మమేకం కాక తప్పని పరిస్థితి. కానీ అనుకోకుండా మన జీవితాల్లోకి మన ప్రమేయం లేకుండా చొరబడిన కరోనా వైరస్ ఆ మార్పులేవో ఇప్పుడే చేయడానికి మార్గం సుగమం చేసింది. వైరస్ చాలా వేగంగా డిజిటల్ బ్యాంకింగ్ వైపు మొగ్గు చూపేలా చేస్తోంది. దీంతో బ్యాంకింగ్ రంగంలో శాఖల విస్తరణకు బ్రేకులు పడ్డాయి. సరికొత్త రూపు రేఖలతో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కరోనా కారణంగా సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. ఎక్కువ మంది బ్యాంకుకు రాకుండానే డిజిటల్ పద్దతిలో లావాదేవీలు సాగిస్తున్నారు. ఇక కాంటాక్ట్ లెస్ బ్యాంకింగ్ దిశగా అడుగులు ప్రారంభం అయ్యాయని ఓ బ్యాంక్ అధికారి అంటున్నారు.

బ్యాంకులు ఇప్పటికే ఇంటరాక్టివ్ టెల్లర్ మెషీన్లను అభివృద్ధి చేసే పనిలో పడ్డాయి. డిపాజిట్లు, విత్ డ్రాయల్స్ తో పాటు అవసరమైతే బ్యాంకర్లతో లైవ్ చాట్ కు వీలు కల్పించే విధంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఒకవేళ కొత్త శాఖలు ఏర్పాటు చేస్తే మ్యాన్ పవర్ తక్కువగా, సాంకేతికత ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ రంగంలో మరిన్ని మార్పులు చోటు చేసుకుంటాయని ఎస్బీఐ ఉన్నతాధికారి అంటున్నారు. అయితే గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల వినియోగదార్లకు శాఖల అవసరం ఉందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు వినియోగదారులతో సంబంధాలు, శాఖల అవసరం ఉంటుందని అధికారి స్పష్టం చేశారు.

Next Story

RELATED STORIES