అంతర్జాతీయం

సరిహద్దులో చైనా కుట్రకు కారణమిదేనా?

సరిహద్దులో చైనా కుట్రకు కారణమిదేనా?
X

భారత్ - చైనా. ఈ పొరుగు దేశాల మధ్య ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన తొలి రెండు దేశాలివి. మెరుగైన అభివృద్ధి రేటుతో ప్రపంచంలో బలమైన ఆర్ధిక వ్యవస్ధలుగా ఎదుగుతున్న దేశాలు. మార్కెట్ విస్తీర్ణాన్ని పెంచుకునేందుకు నువ్వా- నేనా అని స్థాయిలో తీవ్రంగా పోటిపడుతున్న పొరుగు దేశాలు. చౌవకైన శ్రమశక్తికి ఈ రెండు దేశాల్లో కొదవలేదు.

ప్రపంచం మార్కెట్ పై పట్టుబిగించేందుకు ఆగ్రరాజ్యంపైనే కాలుదువ్వుతున్న చైనా..ఆసియా భూభాగంలో పెద్దన్నగా చలామణి అవుతోంది. ఆసియా దేశాల్లో ఏకైక పోటీ దేశంగా ఉన్న భారత్ అంటే చైనా ఎప్పుడూ కంటగింపే. భారత్ దూకుడును అడ్డుకొని పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. సరిహద్దు సమస్యలు సృష్టించి ఉక్కిరిబిక్కిరి చేసేందుకు కుట్రలు చేస్తూనే ఉంది. ఓ వైపు పాకిస్తాన్ కు వెన్నంటే ఉంటూ LOCలో అగ్గిరాజేస్తోంది. ఇటు వాస్తవాధీన రెఖ వెంబడి ఉద్రిక్తతలకు కారణంగా నిలుస్తుంది. దీనికితోడు ఇప్పుడు నేపాల్ ను కూడా సరిహద్దు వివాదంలో భారత్ పైకి ఎగదోస్తోంది. ఇది చాలదన్నట్టు 45 ఏళ్ల తర్వాత తొలిసారిగా వాస్తవాధీన రేఖ రక్తమోడేందుకు డ్రాగన్ కంట్రీ కారణమైంది. గాల్వన్ లోయలో కొద్దిరోజులుగా నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తత..తీవ్ర ఘర్షణగా మారటంతో ఇరు దేశాల సైనికులు మృతి చెందారు.

ఇవే ఇప్పుడు భారత్ ముందున్న సవాళ్లు. చీటికిమాటికి భారత్ పైకి తోక జాడిస్తున్న డ్రాగన్ దేశానికి సరైన బుద్ధిచెప్పాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఏదో ఒకటి చేసి చైనా గుణపాఠం చెప్పగలిగితే..ఇటు పాక్, నేపాల్ కు వాటంతట అవే సైలెంట్ అయిపోతాయి. కానీ, భారత్- చైనా రెండూ అణ్వాయుధ దేశాలే. పైగా ఆయుధాల పరంగా చైనాకు వెయిట్ ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో వెపన్‌ వార్ ప్రపంచంలోనే తీవ్ర అనిశ్చితికి కారణమవుతుంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధమంటూ జరిగితే అది మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకశాలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే తెలిసి తెలిసి యుద్ధంతో నాశనాన్ని కొని తెచ్చుకోకుండా మరో ప్రత్యామ్నయ మార్గంలో చైనాకు బుద్ధి చెప్పాలి. చైనాతో యుద్ధం జరగాలి.. కానీ, అదీ ఆర్ధికంగా మాత్రమే ఆయి ఉండాలనేది మేధావుల ఆలోచన. చైనా అంటే గిట్టని పలు దేశాలు కూడా ఇప్పుడు ఇదే కోరుకుంటున్నాయి.

అసలే కరోనా కష్టాలతో ప్రపంచ దేశాలు ఆర్ధిక సమస్యలతో అల్లాడిపోతున్నాయి. భారత్- చైనాలోనూ మాంద్యం ముప్పు పొంచి ఉంది. ఈ పరిస్థితుల్లో యుద్ధమంటే సూసైడల్ ఆన్నమాటే. అయితే..కరోనా ఎపిసోడ్ లో చైనా దోషి గా నిలబడిపోయింది. వైరస్ పుట్టుక, విస్తృతిని గోప్యంగా ఉంచి ఇప్పుడు కుంటిసాకులతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న చైనా అంటే.. ప్రపంచ దేశాలకు ఓ మోసపూరిత దేశంగా ఇమేజ్ పడిపోయింది. డ్రాగన్ కంట్రీ పతనాన్ని కాంక్షిస్తున్న అమెరికా ఇదే అదనుగా చైనా బజారుకీడ్చి ఆర్ధికంగా నాశనం చేయాలని చూస్తోంది. చైనాతో కొన్నాళ్లుగా ఆమెరికా వాణిజ్య యుద్ధం చేస్తోంది. ఇప్పుడు భారత్ ను కూడా తనకు తోడుగా ప్రొత్సహిస్తోంది. జీ 7 సమావేశాలకు భారత్ కు ఆహ్వానం పంపి చైనాకు షాకిచ్చిన ట్రంప్.. చైనాలోని ఇప్పటికే ఉన్న అమెరికా సంస్థలను కూడా అక్కడి తరలించేలా ప్రేరేపిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు చైనాలో కార్యకలాపాలను క్లోజ్ చేశాయి. ఆసియా దేశాల్లో చైనాకు మరో ప్రత్యామ్నాయ మార్కెట్ అయిన భారత్ వైపు మళ్లుతున్నాయి. ఆసియా దేశాల్లో మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్న యూరోపియన్ యూనియన్ దేశాల కంపెనీలు కూడా భారత్ వైపే మొగ్గుచూపుతున్నాయి. ఈ పరిణామాలన్ని భారత్ పై చైనాకున్న అసూయను రెట్టింపు చేశాయి.

నిజానికి చైనా వస్తువులను నిషేధించాలంటూ సోషల్ మీడియాలో కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. చైనా ఉత్పత్తులు చౌకగా లభించినా నకిలీ, నాసిరకానికి బ్రాండ్ అనే మచ్చ కూడా ఉంది. ప్రపంచంలోనే ప్రతి బ్రాండ్ కు నకిలీ తయారు చేసే చైనా ప్రాడక్ట్స్ పై బోలెడు జోక్స్ పేలుతుంటాయి. అందుకే చైనా ప్రాడక్ట్స్ పై పలు దేశాలు విముఖంగా ఉన్నా..చౌకవగా దొరుకుతాయనే ఒకే ఒక కారణంతో డ్రాగన్ కంట్రీ దేశం ఉత్పత్తులు మార్కెట్ లో నిలబడుతున్నాయి. అయితే..కరోనా తర్వాత ఈ ధోరణిలో కొంత మార్పు వస్తోంది. ముఖ్యంగా భారత్ లో చైనా వస్తువులను నిషేధించాలని డిమాండ్ మరింత ఊపందుకుంది. ఇక ఇప్పుడు సరిహద్దులో పాక్, నేపాల్ వంటి చీడ పొరుగులను తయారు చేస్తున్న చైనాపై కసి తీర్చుకోవాలంటే ఆ దేశ ఉత్పత్తులను పూర్తిగా బ్యాన్ చేయాలంటున్నారు. కానీ, గ్లోబలైజేషన్ కారణంగా చైనా వస్తువులను భారత మార్కెట్లోకి రాకుండా నిషేధించటం కుదరదు. అందుకే వాటిని నిషేధించకుండా వాటి మార్కెట్ ను పతనం చేయగలిగితే..అటోమెటిగ్గా దిగుమతులు నిలిచిపోతాయి. భారత్ లాంటి మెగా మార్కెట్ లో తమ ఉత్పత్తులకు గిరాకీ లేకుండా చైనా ఆదాయం భారీ నష్టం తప్పదు. అదే సమయంలో స్వదేశీ వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. దీంతో కేంద్రం కూడా స్వదేశీ వస్తువులనే కొనాలని పిలుపునిస్తోంది. ప్రపంచంలోని పేరుమోసిన బ్రాండ్ లన్ని ఆయా దేశాల్లో ఒకప్పుడు స్థానిక ఉత్పత్తులుగా మార్కెట్ ప్రారంభించాయి. అక్కడి స్వదేశీ వస్తువులను కొని విరివిగాకి ప్రాచారం చేయటం ద్వారా వాటి బ్రాండ్ ఇమేజ్ పెరిగి ప్రపంచం బ్రాండ్ ప్రొడక్ట్స్ అవుతున్నాయి. ఇక భారత ప్రజలు కూడా స్వదేశీ వస్తువులనే కొనాలని, కొనటమే కాదు వాటిని ప్రచారం చేసి బ్రాండ్ ఇమేజ్ పెంచాలని ప్రధాని పిలుపునిచ్చారు.

మన మార్కెట్ లోకి ఉత్పత్తులు ఎగదోసి మన స్థానిక మార్కెట్ ను కూల్చేసి..మన ప్రజల డబ్బుతో మన దేశంపైనే యుద్ధం చేసే చైనా వస్తువులను కొందామా? చైనా వస్తువులను బహిష్కరించి దేశానికి వెన్నుదన్నుగా నిలుద్దామా? ఇది ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం. చైనాను గెలవాలంటే సర్వనాశనం అయిపోయేలా యుద్ధమే చేయాల్సిన పనిలేదు. కేంద్రం పిలుపుమేరకు అక్కడి ఉత్పత్తుల గిరాకీ తగ్గించి..మన బ్రాండ్ వాల్యు పెంచుకోవాలి. అలాగే కరోనా మచ్చ పడిన చైనా వైపు ప్రపంచ దేశాల పెట్టుబడులు వెళ్లకుండా సరైన విధి విధానాలతో పెట్టుబడులను మనవైపు తిప్పుకోగలిగితే చైనాను చావుదెబ్బ తీసినట్టే అవుతుంది.

Next Story

RELATED STORIES