వాహనదారులకు షాక్.. రూ. 80 దాటిన పెట్రోల్ ధర..

వాహనదారులకు షాక్.. రూ. 80 దాటిన పెట్రోల్ ధర..
X

భారతదేశంలో ఇంధన ధరలను వరుసగా 11 వ రోజుకు పెంచాయి ఆయిల్ కంపెనీలు. తాజాగా పెట్రోల్ ధర లీటరుకు 55 పైసలు, డీజిల్ ధర 69 పైసలు పెరిగింది. సవరించిన ధరలతో ఢిల్లీలో ఒక లీటరు పెట్రోల్ ధర నిన్న రూ .76.73 తో ఉండగా ఇప్పుడది రూ .77.28 అయింది. అదే విధంగా డీజిల్ ధర లీటరుకు రూ .75.79 కు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర తాజా పెరుగుదలతో లీటరుకు రూ .84 దాటింది, డీజిల్ మాత్రం లీటరుకు 74.32 రూపాయలకు లభిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ.80 దాటాయి.. హైదరాబాద్‌లో బుధవారం లీటరు పెట్రోల్ ధర 57 పైసలు పెరుగుదలతో రూ.80.22కు, డీజిల్ ధర 58 పైసలు పెరుగుదలతో రూ.74.07కు ఎగిసింది. విజయవాడలో పెట్రోల్‌ ధర 55 పైసలు పెరుగుదలతో రూ.80.66కు చేరింది. డీజిల్ ధర రూ.74.17కు చేరింది. అలాగే చెన్నై, పాట్నాలలో లీటరు పెట్రోల్ ధర 80 రూపాయలు దాటింది. కోల్‌కతా, బెంగళూరులలో లీటరు ధర 79 రూపాయలు గా ఉంది.

Next Story

RELATED STORIES