చుట్టూ శవాలు.. నన్ను ఇంటికి తీస్కెళ్లండి: ఢిల్లీలో కరోనా పేషెంట్

చుట్టూ శవాలు.. నన్ను ఇంటికి తీస్కెళ్లండి: ఢిల్లీలో కరోనా పేషెంట్

కరోనా వైరస్ ఎంత మంది ప్రాణాలను బలిగొంటుందో. ఈ ఆస్పత్రిలో నేను ఉండలేను నన్ను ఇంటికి వెళ్లనివ్వండి. చుట్టూ శవాలు.. ఇక్కడే ఉంటే భయంతో చచ్చిపోయేలా ఉన్నాను అని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ రిటైర్డు అధికారి సురేందర్ వాపోతున్నారు. జూన్ 8న ఆయనకు కరోనా నిర్దారణ అయింది. దాంతో స్థానికంగా ఉన్న లోక్ నాయక్ జయప్రకాశ్ (ఎల్ఎన్ జేపీ) ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స నిమిత్తం ఎమర్జెన్సీ వార్డుకు తీస్కెళ్లగా అక్కడ అన్నీ మృతదేహాలే ఉన్నాయని ఇంటికి ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు తెలిపారు.

ఎట్టకేలకు ఆ ఆస్పత్రినుంచి బయటకు వచ్చి మరో ఆస్పత్రిలో చేరడానికి ప్రయత్నిస్తున్నారు. ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు నాన్న ఎంతో ఇబ్బంది పడ్డారని సురేందర్ కుమారుడు చెబుతున్నారు. అక్కడ ఏర్పాట్లేవీ సరిగా లేవు. బ్రెడ్డు ముక్కలు పెట్టారు. నీళ్లు లేవు. ఇంకో రెండు రోజులు అక్కడే ఉంటే చనిపోయేవాడిని అని. ఎక్కడ చూసినా మృత దేహాలే అని సురేందర్ చెప్పుకొచ్చారు. కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ రాజధానిలో ఆస్పత్రుల పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉందని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం ఎల్ఎన్ జేపీ ఆస్పత్రిని సందర్శించారు. కరోనా పేషెంట్ల చికిత్స కోసం చేసిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story