అంతర్జాతీయం

కరోనా ఎఫెక్ట్.. గనుల్లో వజ్రాలు కుప్పలుతెప్పలుగా..

కరోనా ఎఫెక్ట్.. గనుల్లో వజ్రాలు కుప్పలుతెప్పలుగా..
X

కరోనా వైరస్ అన్ని రంగాలను అతలా కుతలం చేసింది. ఎప్పటికి మళ్లీ మంచి రోజులు వస్తాయో చెప్పలేని పరిస్థితి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కారణంగా బోట్స్ వానా రాజధాని గాబొరోన్ లోని గనుల్లో వజ్రాలు కుప్పలు తెప్పలుగా పడున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల గనులున్న ప్రాంతాల్లో ఇది ఒకటి. ప్రసిద్ధ మైనింగ్ కంపెనీ డీ బీర్స్ ఇక్కడ వజ్రాల తవ్వకాలు జరిపి మార్కెట్ చేస్తుంటుంది. కరోనా కారణంగా ఫిబ్రవరి నుంచి ఒక్క వజ్రం కూడా అమ్మలేకపోయింది. రష్యాకు చెందిన అల్ రోసా పీజేఎస్ సీ పరిస్థితి కూడా అదే.

ప్రపంచ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్థంభించి పోవడంతో వజ్రాలు చూసేందుకు బయ్యర్లు రావడం లేదు. భారత్ లో కూడా నగల వ్యాపారం మందగించింది. గోల్డ్ స్మిత్ ఇంటికే పరిమిత మవడంతో కొనుగోలు దారులు కొత్త ఆర్డర్లు ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదు. దాంతో వ్యాపారం అనుకున్నంతగా సాగడం లేదు. వినియోగ దారులను ఆకర్షించే ఆఫర్లు కూడా పెట్టడానికి లేదు. ఒకవేళ ఆఫర్లు పెడితే కొనుగోలు దారులు ఎక్కువ మంది వస్తారు. షాపులు రద్దీని భరించడం కష్టమవుతాయి. వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఆఫర్లకు ప్రస్తుతం తిలోదకాలు ఇచ్చారు షాపు యజమానులు. ఖరీదైన వజ్రాలు కొనే వాళ్లు లేక వెల వెల పోతున్నాయి. జెమ్ డాక్స్ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్ల డాలర్ల విలువ చేసే వజ్రపు నిల్వలు ఉన్నాయి.

Next Story

RELATED STORIES