టాయిలెట్ లోనే 7 రోజులు క్వారంటైన్

టాయిలెట్ లోనే 7 రోజులు క్వారంటైన్
X

కరోనా సోకినా ఇకపై ఆస్పత్రిలో ఉండాల్సిన పని లేదు.. మందులు వాడుతూ ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉండి 14 రోజులు క్వారంటైన్ పాటిస్తే సరిపోతుందని ప్రభుత్వాలు చెప్పినా సామాన్యుడికి అది సాధ్యమయ్యే పనేనా.. రెండు గదుల ఇంట్లో నలుగురు సర్ధుకుంటున్న కుటుంబాలు ఎన్నో. వేరే రాష్ట్రం నుంచి వచ్చినా కరోనా లేక పోయినా క్వారంటైన్ లో 14 రోజులు గడపాల్సిందే అన్న రూలు అతడి పాలిట శాపమైంది. ఒడిశాకు చెందిన మానస్ పత్రా తమిళనాడులో ఉద్యోగం చేస్తుంటాడు.

ఇటీవల స్వస్థలం ఒడిశాకు వెళ్లగానే అధికారులు అతడిని 7 రోజుల పాటు స్థానికంగా ఉన్న సుదుకాంతి పాఠశాలలో ప్రభుత్వం నడుపుతున్న తాత్కాలిక క్వారంటైన్ లో ఉంచారు. టెస్ట్ చేయగా కరోనా లేదని తేలింది. ఇంటికి పంపించే ముందు ఎందుకైనా మంచిదని మరో 7 రోజుల పాటు హోం క్వారంటైన్ చేయమన్నారు. అసలే అతడి ఇంట్లో 6 కుటుంబ సభ్యులు ఉంటారు. అక్కడ వేరే గదిలో సెపరేట్ గా ఉండడం కష్టం సార్ ఇక్కడే ఉంటాను ఆ వారం రోజులు కూడా అంటే అధికారులు వినిపించుకోలేదు. దాంతో ఇంట్లో మరో గది లేకపోవడంతో కుటుంబ భద్రత దృష్ట్యా 7 రోజులు టాయిలెట్ ఉండాల్సి వచ్చిందని పత్రా వివరించాడు.

Next Story

RELATED STORIES