వీర సైనికులకు నివాళులు అర్పించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్

X
గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మద్య జరిగిన ఘర్షణలో మరణించిన వీర సైనికులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివాళి అర్పించారు. భారత సైనికులు దేశం కోసం చేసిన కృషి, వారి దైర్య సాహసాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. సైనిక బలగాలకు సుప్రీం కమాండర్ గా.. వీర మరణం పొందిన సైనికులకు నివాళులు అర్పిస్తున్నానని రామ్నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. దేశకోసం ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాలకు రాష్ట్రపతి సంతాపం తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
