స్వస్థలానికి చేరుకున్న కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం

కల్నల్ సంతోష్ బాబు పార్థివ దేహం హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంది. గవర్నర్ తమిళిసైతోపాటు, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, జగదీష్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డీజీపీ మహేందర్‌రెడ్డి, కమిషనర్లు సంతోష్‌బాబుకు నివాళులర్పించారు. అనంతరం ఆర్మీ సైనిక వందనం సమర్పించింది. తర్వాత ORR మీదుగా భౌతికకాయాన్ని సూర్యాపేటకు తరలించారు.
కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు గురువారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. 9 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. జిల్లా, ఆర్మీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు..కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్, ఆర్మీ ఉన్నతాధికారులు దగ్గరుండి ఏర్పాట్లును పరిశీలించారు. ఆర్మీ, ప్రభుత్వ, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. ఆర్మీ మేజర్లు, ఉన్నతాధికారులు కూడా లాస్ట్ రైట్స్‌లో పాల్గొంటారు. సంతోష్ బాబును కడసారి చూసేందుకు వచ్చే వారు భౌతిక దూరం పాటించాలని, ప్రజలు సంయమనం పాటించాలని పోలీసులు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com