జూన్ 21న కరోనాకు చెక్ పడనుందా..!!

జూన్ 21న కరోనాకు చెక్ పడనుందా..!!

ఈ వార్త నిజమైతే ఎంత బావుండు. 18సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఇలాంటి సూర్యగ్రహణం మహమ్మారి కరోనాను అంతం చేస్తుందని పండితులు ఆశిస్తున్నారు. ఈ సంవత్సరంలో ఏర్పడే తొలి సూర్యగ్రహణం జూన్ 21న ఏర్పడనుంది. ఈ గ్రహణ ప్రభావంతో మార్పులు రావచ్చని పండితులు విశ్వసిస్తున్నారు. 2019 డిసెంబర్ 26న వచ్చిన సూర్యగ్రహణ సమయం నుంచి ప్రపంచంలో కరోనా వైరస్ మొదలైంది కాబట్టి.. జూన్ 21న ఏర్పడనున్న సూర్య గ్రహణంతో కరోనాకు శుభం కార్డు పడనున్నదని జ్యోతిష్కులు అభిప్రాయపడుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థితిగతుల ఆధారంగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలను పండితులు అంచనా వేస్తుంటారు. గ్రహణ సమయంలో నవగ్రహాల ప్రభావం మనుషులపై ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. జాతక రిత్యా కూడా గ్రహణాల వల్ల కలిగే మంచి చెడు ఫలితాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఏడాదిలో చంద్రగ్రహణం ఇప్పటికే రెండు సార్లు వచ్చింది. ఇక అతిపెద్ద సూర్యగ్రహణం జూన్ 21న ఏర్పడనుంది. ఆ రోజు సూర్యుడు మరింత ప్రకాశ వంతంగా కనిపిస్తాడు. ప్రపంచ వ్యాప్తంగా అందరూ వీక్షించే ఈ సూర్య గ్రహణం 18 ఏళ్లకు ఒకసారి వస్తుంది. అయితే భారత్ లో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఈ గ్రహణాన్ని చూడవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story