తాజా వార్తలు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. సత్తాచాటిన బాలికలు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. సత్తాచాటిన బాలికలు
X

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విద్యాశాఖ విడుదల చేసింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 60.01 శాతం, సెకండ్ ఇయర్‌లో 68.86 శాతం ఉత్తీర్ణత సాధించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఫస్ట్ ఇయర్ 75శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా మొదటి స్థానంలో, 71 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి, కొమరంభీం జిల్లాలు రెండో స్థానంలో ఉన్నాయి. ఇక, రెండో సంవత్సరంలో కొమరంభీం జిల్లా 76 శాతంతో మొడటి స్థానంలో ఉండగా.. మేడ్చల్ జిల్లా 75 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది బాలికలే సత్తా చాటారు.

Next Story

RELATED STORIES