పల్సర్ 125.. సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి..

పల్సర్ 125.. సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి..
X

యువతరాన్ని ఆకర్షించే పల్సర్ బైక్ సరికొత్తగా ముస్తాబై అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లో అడుగు పెట్టింది. గురువారం బజాజ్ ఆటో మార్కెట్లో పల్సర్ 125 స్పిట్ సీట్ వేరియంటో పేరుతో రిలీజ్ చేసింది. ఈ బైక్ ని అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించామని సంస్థ తెలిపింది. రెగ్యులర్ మోడల్ లో ఉండే సింగిల్ యూనిట్ కు బదులుగా స్పోర్టి బెల్లీ పాన్, స్పిట్ గ్రాబ్ రైల్స్ వంటి కొన్ని అదనపు ఫీచర్లతో బైక్ ప్రియులను అలరిస్తోంది. ఇక ఈ 125 బైక్ బ్లాక్ సిల్వర్, బ్లాక్ రెడ్, నియాన్ గ్రీన్ కలర్స్ లో అందుబాటులో ఉన్నాయని సంస్థ తెలిపింది. ధర విషయానికి వస్తే రూ.79,091గా నిర్ణయించింది. బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సారంగ్ కనడే స్పందిస్తూ గత సంవత్సరం విడుదల చేసిన పల్సర్ 125 బైక్ కేవలం ఆరు నెలల్లోనే లక్ష బైకులు మార్కెట్ చేశామని చెప్పుకొచ్చారు. ఇక స్పోర్ట్స్ బైక్ ని ఇష్టపడేవారికి ఈ సరికొత్త వేరియంట్ 125 బైక్ విశేషంగా ఆకర్షిస్తుందని అన్నారు.

Next Story

RELATED STORIES