మణిపూర్‌లో పతనం అంచున బీజేపీ సర్కార్

మణిపూర్‌లో పతనం అంచున బీజేపీ సర్కార్
X

మణిపూర్‌లో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. డిప్యూటీ సీఎం వై. జాయ్ కుమార్ సింగ్ తో సహా 6 మంది ఎమ్మెల్యేల రాజీనామా చేశారు, దాంతో అసెంబ్లీలో బల పరీక్షకు కాంగ్రెస్ పట్టుబడుతోంది. బిరెన్ సింగ్ ప్రభుత్వం ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయిందని తద్వారా అవిశ్వాస తీర్మానానికి అనుమతించాలని కోరుతూ గురువారం గవర్నర్ నజ్మా హెప్తుల్లాను కలిసింది కాంగ్రెస్ బృదం. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి ఓక్రామ్ ఇబోబి సింగ్‌ను కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకుంది. మణిపూర్‌లో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఇబోబీ సింగ్ త్వరలో కొత్త ముఖ్యమంత్రిగా ఉంటారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి నింగోంబం భూపేంద్ర మీటీ తెలిపారు. బీజేపీ ప్రభుత్వం పతనం అంచున ఉందన్నారు.

ఇదిలావుంటే మణిపూర్‌లో 2017 మార్చిలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బీజేపీ రాష్ట్రంలోని 60 స్థానాల్లో 21 స్థానాలను గెలుచుకుంది, అలాగే కాంగ్రెస్ పార్టీ 28 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ బీజేపీకి ఎన్‌పిపి, నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ నుంచి గెలిచినా నలుగురు ఎమ్మెల్యేలు, అలాగే టిఎంసి, లోక్‌ జనశక్తి పార్టీ నుంచి ఇద్దరు సభ్యులు, స్వతంత్ర ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాదు కాంగ్రెస్ సభ్యుడు శ్యాంకుమార్ బీజేపీలో చేరారు. అయితే శ్యాంకుమార్‌ సింగ్‌పై అనర్హత వేటు పడటంతో అధికారంలోని బీజేపీ బలం 23కి పడిపోయింది.

Next Story

RELATED STORIES