కొత్త మ్యాప్‌కు నేపాల్ పార్లమెంట్ ఎగువసభ ఆమోదం

కొత్త మ్యాప్‌కు నేపాల్ పార్లమెంట్ ఎగువసభ ఆమోదం

భారత్‌ భూభాగాలైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధూరా ప్రాంతాలను తమ ప్రాంతాలుగా చూపిస్తూ.. విడుదల చేసిన మ్యాప్‌ను నేపాల్ పార్లమెంట్ ఎగువ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మొత్తం 57 మంది సభ్యులూ ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. అయితే, తరువాత దీనిని రాష్ట్రపతికి పార్లెమెంట్ పంపిస్తుంది. రాష్ట్రపతి దానిని పరిశీలించి ఆమోద ముద్ర వేస్తే.. ఇంకా ఆ మ్యాప్ అమలులోకి వస్తుంది. ఈ బిల్లులను గతవారం నేపాల్ పార్లెమెంట్ దిగువ సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే, భారత్ భూభాగాలను తమవిగా చూపిస్తూ రూపొందించిన మ్యాప్ విషయంలో భారత్ ప్రభుత్వం తీవ్రంగా మండిపడుతోంది. అయినా.. నేపాల్ ప్రభుత్వం వెనక్కు తగ్గడంలేదు.

Tags

Read MoreRead Less
Next Story