ఇతడేనా అతడు.. నిహారికకు కాబోయే వరుడు..

నీహా.. ఎవరే అతగాడు.. ఇట్టే నీ మనసుని దోచాడు.. అంటూ సాంగేసుకుంటున్నారు నెటిజన్లు నిహారిక పెట్టిన పోస్టును చూసి. ఎవరో చెప్పొచ్చుగా ఎందుకలా ఊరిస్తావు ఊరగాయ పచ్చడిలా అంటున్నారు నిహారిక బాహువుల్లో బంధీ అయిన వ్యక్తిని చూసి. పెళ్లికి సంబంధించిన హింట్లిస్తూ అభిమానులకు ఆసక్తి రేపుతోంది మెగా డాటర్. త్వరలోనే నిహారికకు పెళ్లి చేస్తామని నాన్న నాగబాబు ఈ మధ్యే క్లారిటీ ఇచ్చారు. దాంతో వరుడెవరో ఫిక్సైనట్టుంది అనుకుంటున్నారు నిహారిక పెట్టిన పోస్టులు చూసి.
ఈ వార్తను నిజం చేస్తూ కప్పుపై మిస్ నిహారిక అని పేరును కొట్టేసి మిసెస్ అని క్వశ్చన్ మార్క్ పెట్టింది. దీంతో నిజంగానే పెళ్లి ఫిక్సయిందని భావిస్తున్నారు. తాజాగా నిహా ఇన్ స్టా అకౌంట్ లో ఈ ఫోటో పోస్ట్ చేసింది. అతడే నిహారికకు కాబోయే భర్త అని కథలల్లేస్తున్నారు. తనకు కాబోయే వరుడు సినిమా వ్యక్తులు కాదని గుంటూరుకు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారి కుమారుడు చైతన్య అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com