బ్యాంకు క్యాషియరే దొంగ.. 15 కిలోల బంగారం..

బ్యాంకు క్యాషియరే దొంగ.. 15 కిలోల బంగారం..
X

ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరని క్యాషియరే దొంగతనం చేస్తే ఎవరు పట్టుకుంటార్లే అనుకున్నాడేమో ఎస్బీఐ బ్రాంచ్ కి చెందిన ఉద్యోగి. ఇంట్లో దొంగలు పడతారని బ్యాంకు లాకర్ లో బంగారం దాచుకుంటే అది కాస్తా ఆ క్యాషియరే దొంగిలించాడు. మధ్యప్రదేశ్ షియోపూర్ లోని ఎస్బీఐ బ్రాంచిలో 15 కిలోల బంగారం మాయమైనట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో వారికి బ్యాంకు క్యాషియర్ పై అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు అతడిని నిలదీయగా తానే బంగారం దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. తనతో పాటు తన స్నేహితుడు నవీన్, స్నేహితురాలు జ్యోతిలతో కలిసి ఈ చోరీ చేసినట్లు తెలిపాడు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 15 కిలోల బంగారం 11 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

RELATED STORIES