సినీ నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా..!!
X

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 499 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 329 కేసులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వెలుగుచూశాయి. తాజాగా సినీ నిర్మాత బండ్ల గణేష్ కూడా కరోనా వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్తలపై కొందరు మీడియా ప్రతినిధులు బండ్ల గణేష్ ను సంప్రదించగా ఆయన అవునని నిర్ధారించారట. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నానని, రెండు రోజుల్లో అపోలో లేదా కాంటినెంటల్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ కోసం జాయిన్ అవుతానని తెలిపారట. హెయిర్ ప్లాంటేషన్ చేయించుకోవడానికి వెళ్లినప్పుడు అక్కడ కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చినట్లు తేలింది అని సమాచారం. ఇదిలా ఉంటే, బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్ ప్రభావం సినిమా పరిశ్రమపై ఏమేర పడుతుందో చూడాలి.

Next Story

RELATED STORIES