ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు.. నలుగురు పిల్లలకు ఉరేసి..

ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు.. నలుగురు పిల్లలకు ఉరేసి..
X

ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు.. నలుగురు పిల్లలకు ఉరేసి అన్నదమ్ములిద్దరూ తామూ ఉరి వేసుకుని చనిపోయారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తుల మరణం స్థానికంగా సంచలనం రేపింది. అందులో అభం శుభం తెలియని నలుగురు చిన్నారులకు ఉరివేసి చంపడం అత్యంత బాధాకరం. అహ్మదాబాద్ కు చెందిన ఇద్దరు సోదరులు అమ్రిష్ పటేల్ (42), గౌరంగ్ పటేల్ (40) వారి భార్యా పిల్లలతో వేరు వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు.

జూన్ 17న పిల్లలని తీసుకుని తమకు ఉన్న మరో ప్లాట్ దగ్గరకు వెళతామని చెప్పారు అన్నదమ్ములిద్దరూ భార్యలతో. 18 వ తేదీ రాత్రి అయినా రాకపోవడంతో భార్యలిద్దరూ అనుమానంతో ఫ్లాట్ కి వచ్చారు. అది లోపలి నుంచి లాక్ చేసి ఉంది. ఎన్ని సార్లు కాలింగ్ బెల్ కొట్టినా తీయట్లేదు.. ఫోన్ లిప్ల్ చేయట్లేదు. దాంతో వాళ్లిద్దరూ కంగారు పడుతూ పోలీసులను ఆశ్రయించారు. దాంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూశారు.

ఆరుగురు వ్యక్తులు ఉరి వేసుకుని నిర్జీవంగా వేలాడుతూ కనిపించారు. అందులో నలుగురు చిన్న పిల్లలకు అన్నంలో మత్తు మందు కలిపి ఇచ్చి నిద్రలోకి జారుకున్న వెంటనే ఉరి వేశారు. అనంతరం అన్నదమ్ములు ఇద్దరూ ఉరి వేసుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు. బిడ్డలని, భర్తలను కోల్పోయిన భార్యలు షాక్ తో కుప్పకూలిపోయారు. మృతదేహాలను పోస్ట్ మార్టంకి తరలించారు. వారి ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

RELATED STORIES