ఎవరి గోల వారిది.. ఐసోలేషన్ వార్డ్ కి వెళ్లి ఫోన్ చోరీ..

ఎవరి గోల వారిది.. ఐసోలేషన్ వార్డ్ కి వెళ్లి ఫోన్ చోరీ..
X

అసోంలోని చిరాంగ్ జిల్లా జెఎస్ఎస్ బి సివిల్ హాస్పిటల్ లో సోమవారం కరోనా పేషెంట్లను ఉంచే ఐసోలేషన్ వార్డులో దొంగతనం జరిగింది. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే, చుట్ట తాగడానికి నిప్పు అడిగాడట మరొకడు.. అలానే ఉంది చూడబోతే.. కరోనా ఎవరికి ఉందో తెలియక.. ఎదుటి వారు తుమ్మినా, దగ్గినా కరోనానేమో అని భయపడుతున్న ఈ రోజుల్లో ఏకంగా కరోనా పేషెంట్ ని ఉంచే ఐసోలేషన్ వార్డ్ కి వెళ్లి ఆ పేషెంట్ ఫోన్ నే చోరీ చేశాడు ఓ దొంగ. పీపీఈ కిట్లు ధరించి వెళ్తేనే పాపం వైద్యులు, సిబ్బంది సైతం కరోనా బారిన పడుతున్నారు.

మరి ఆ దొంగకి ఆ మాత్రం భయం కూడా లేకుండా అలా ఎలా చోరీ చేశాడు అని ఆస్పత్రి సిబ్బంది తల పట్టుకుంటున్నారు. కరోనా పేషెంట్ ఫోన్ చోరీ చేసిన విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశారు. మళ్లీ ఆ దొంగ వెళ్లి మరెంత మందికి కరోనా అంటిస్తాడోనని ఆందోళన చెందారు. 22 ఏళ్ల బర్మన్ అనే వ్యక్తి పేషెంట్ ఫోన్ ని దొంగతనం చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి బర్మన్ ని వెతికి పట్టుకుని క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. కరోనా టెస్ట్ కి రక్తనమూనాలు పంపించి ఎవరెవరని కలిశావు, ఎక్కడెక్క తిరిగావు అని బర్మన్ ని విచారిస్తున్నారు.

Next Story

RELATED STORIES