కరోనాతో మృతి చెందిన నాగిరెడ్డి మనవడు..

కరోనాతో మృతి చెందిన నాగిరెడ్డి మనవడు..
X

ప్రముఖ నిర్మాత, విజయా సంస్థల అధినేత దివంగత బి. నాగిరెడ్డి మనవడు శరత్ రెడ్డి (52) శుక్రవారం ఉదయం చెన్నైలో కరోనా వైరస్ తో మృతి చెందారు. నాగిరెడ్డికి ఇద్దరు కొడుకులు. రెండో కొడుకు కుమారుడు శరత్ రెడ్డి. అతడికి కరోనా సోకడంతో చెన్నైలోని విజయా హెల్త్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో మరణించారు. చందమామ, విజయ, బొమ్మరిల్లు వంటి పత్రికల నిర్వహణ బాధ్యతలను శరత్ రెడ్డి చూసుకునేవారు. ఆయన కొడుకు బెంగళూరులో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. శరత్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Tags

Next Story