తమిళనాడులో డ్రగ్స్ కలకలం.. వందల కోట్లు విలువైన..

తమిళనాడులో డ్రగ్స్ కలకలం.. వందల కోట్లు విలువైన..
X

తమిళనాడులో పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. వందల కోట్ల విలువైన హెరాయిన్ ప్యాకెట్లతో ఉన్న డ్రమ్ములు సముద్రపు ఒడ్డుకు కొట్టుకురావడం సంచలనంగా మారింది. సెంగల్‌ పట్టు మామల్లాపురం సముద్రపు ఒడ్డుకు భారీ డ్రమ్ములు కొట్టుకువచ్చాయి. స్థానికులు వాటిని తెరిచి చూడటంతో ప్యాకెట్లు కనిపించాయి. విషయం తెలుసుకొని అక్కడి వెళ్లిన కోస్ట్‌గార్డ్ అధికారులు వాటిని హెరాయిన్‌గా గుర్తించారు. మొత్తం 78 ప్యాకెట్లు ఉన్నాయి. వీటి విలువ దాదాపు 203 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. షిప్పింగ్‌యార్డ్‌లో అధికారుల తనిఖీలు ఉంటాయని భావించిన స్మగ్లర్లు వాటిని నీళ్లలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

Next Story

RELATED STORIES