యోగాతో కరోనాను అధిగమించవచ్చు: ప్రధాని మోదీ

యోగాతో కరోనాను అధిగమించవచ్చు: ప్రధాని మోదీ

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో చాలాప్రాంతాల్లో ఇంట్లోనే యోగా చేస్తుండగా.. కొన్ని ప్రాంతాల్లో భౌతిక దూరం పాటిస్తూ యోగా చేస్తున్నారు. యోగా శారీరక సౌష్టవంతోపాటు.. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. భారతీయ యోగాను జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీనిలో భాగంగా ఈ రోజున వివిధ దేశాలు యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాయి. కోవిడ్ ఎఫెక్ట్ తో సామూహికంగా కాకుండా నాలుగు గోడలమధ్య చేపడుతున్నారు.

కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ సంవత్సరం ఇంట్లోనే ఉండి యోగా దినోత్సవం జరపుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి యోగా చేయాలన్నారు. దీంతో ఇంట్లో సభ్యుల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి యోగాలో అనేక ఆసనాలున్నాయన్నారు. శ్వాస వ్యవస్థపై కొవిడ్‌ తీవ్ర ప్రభావం చూపుతున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రాణాయామం ద్వారా దాన్ని అధిగమించొచ్చని తెలిపారు. రోజువారీ జీవన విధానంలో ప్రాణాయామాన్ని భాగం చేసుకోవాలని సూచించారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ యోగా చేశారు. ఇంట్లోనే ఆయన కొన్ని యోగాసనాలువేశారు. యోగా మన జీవితంలో భాగస్వామ్యం కావాలన్నారు.

ఇంటర్నేషనల్ యోగా దివస్ లో భాగంగా పలువురు ప్రముఖులు కూడా యోగాసనాలువేశారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.. యోగా గురువు రామ్ దేవ్ బాబాలు యోగాసనాలువేశారు. ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ తమ ఇంట్లోనే ఆసనాలువేశారు. వీరంతా సామాజిక దూరం పాటిస్తూ యోగా దివస్ లో పాల్గొన్నారు.

సరిహద్దుల్లోని సైనికులుసైతం యోగా దివస్ లోపాల్గొన్నారు. హిమాలయాల్లోని గడ్డకట్టే చలిలో సైతం యోగాసనాలువేశారు. సామాజిక దూరం పాటిస్తూ ఇందులో పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story